‘ఛత్రపతి’ విలన్ కన్నుమూత - MicTv.in - Telugu News
mictv telugu

‘ఛత్రపతి’ విలన్ కన్నుమూత

March 14, 2018

బహుభాషానటుడిగాప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించుకున్న నటుడు నరేంద్ర ఝా కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు ప్రకటించారు. బుధవారం ఉదయం 5 గంటల సమయంలో వడాలోని తన ఫామ్‌హౌస్‌లో నరేంద్ర తుదిశ్వాస విడిచారు.

ఛత్రపతి, లెజండ్, యమదొంగ వంటి చిత్రాల్లో నటించి తెలుగువారికి దగ్గరైన నటుడు నరేంద్ర ఝా. కొద్ది రోజులుగా గుండెనొప్పితో బాధపడుతున్న ఆయన షూటింగ్‌లకు విరామం ఇచ్చి ఫాం హౌస్‌లో రెస్ట్ తీసుకుంటున్నారు.

చికిత్స జరుగుతుండగానే.. బుధవారం కన్నుమూశారు. ఇటీవలే ఆయన ‘సాహో’ హిందీ వెర్షన్‌లో నటించారు.సల్మాన్‌ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘రేస్ 3’ లోనూ ప్రాముఖ్యమున్న పాత్ర పోషించారట. బుల్లితెరపై బేగుసరాయ్, ఏక్ ఘర్ బనౌంగా, సూపర్‌కాప్స్ వర్సెస్ సూపర్‌ విలన్స్ వంటి షోలతో అలరించిన నరేంద్ర ఝా.. హైదర్, కాబిల్, మొహంజోదారో, రాయిస్, ఫోర్స్-2 వంటి హిందీ చిత్రాల్లో నటించి మెప్పించారు.

1992 నుండి మోడల్‌గా, నటుడిగా రాణిస్తూ తనదైన ముద్ర వేశారు. ఆయన బిహార్‌లోని మధుబానిలో జన్మించారు.