‘మాతృదేవోభవ’ను తలపిస్తున్న దీనగాథ - MicTv.in - Telugu News
mictv telugu

‘మాతృదేవోభవ’ను తలపిస్తున్న దీనగాథ

February 8, 2018

తమిళనాడుతో జరిగిన సంఘటనను చూస్తుంటే మాతృదేవోభవ సినిమాను తలపిస్తోంది. కని పెంచిన అమ్మ అనారోగ్యంతో చనిపోతే  అంత్యక్రియలకోసం చిన్న చిన్న పిల్లలు భిక్షం ఎత్తుకోవాల్సిన పరిస్థితి. తమిళనాడులో విజయ(40) అనే ఓ మహిళ  భర్త అనారోగ్యంతో  కొన్ని సంవత్సరాల క్రితమే చనిపోయాడు.

 వ్యవసాయ కూలీగా కుటుంబ భారాన్ని మోస్తున్న ఆ తల్లి ఆరోగ్యం ఒక్క సారిగా క్షీణించింది. దవాఖానలో చూపిస్తే  రొమ్ము క్యాన్సర్ అని తేలింది. ఆమెకు ముగ్గురు పిల్లలు. క్యాన్సర్  కారణంగా ఆమె కొన్ని రోజుల మంచానికే పరిమితమైంది.

చిన్న పిల్లైన కూతురిని ఓ అనాథాశ్రమంలో  చేర్పించింది. మోహన్(14)  మేలు మురుగన్(13)  కుమారులిద్దరు  తల్లితోనే ఉంటున్నారు. తల్లి అనారోగ్యం పూర్తిగా క్షీణించడంతో  పక్కింటి వారి సాయంతో ఆ చిన్న పిల్లలిద్దరు  ఆమెను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.  క్యాన్సర్  చివరి దశకు రావడంతో ఆమె బుధవారం ఆసుపత్రిలో కన్నుమూసింది.

తల్లి చనిపోయిందని  తల్లడిల్లిన ఆ పిల్లలిద్దరు బోరున ఏడ్చారు.  తల్లి అంత్యక్రియలకు  డబ్బులు లేక  ఆ పిల్లలిద్దరు ఆసుపత్రి బయటే ఏడుస్తూే బిచ్చం ఎత్తుకున్నారు.  వారి దీన స్థితిని చూసిన చాలామంది  వారికి సాయం చేశారు. ఈవిషయం  హాస్పిటల్ వెల్ఫేర్ విభాగం అసోసియేట్ డైరెక్టర్ మాలతీ ప్రకాశ్‌కు తెలియడంతో ఆమె  ముందుకు వచ్చి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయించారు.