నరబలి కేసులో మరో ట్విస్ట్.. పాపను బెగ్గింగ్ మాఫియా ఎత్తుకొచ్చిందా ? - MicTv.in - Telugu News
mictv telugu

నరబలి కేసులో మరో ట్విస్ట్.. పాపను బెగ్గింగ్ మాఫియా ఎత్తుకొచ్చిందా ?

February 17, 2018

ఉప్పల్ చిలుకానగర్‌లో జరిగిన చిన్నారి నరబలి కేసులో ఎన్నో నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మొదట  ఎదురింటి వాళ్లను అనుమానించిన  పోలీసులకు ఆ తర్వాత  ఇంటి ఓనరే అసలు నిందితుడు అని విచారణలో తేలింది. తన భార్య శ్రీలత ఆరోగ్యం బాగాలేదని క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్  రెండు సంవత్సరాల కిందట మేడారంలో ఓ కోయదొరకు చెబితే అతగాడు నరబలి ఇవ్వమన్నాడని, అందుకే బలి ఇచ్చానని రాజఖర్ చెప్పాడు. పథకం ప్రకారం బోయిగూడలో ఫుట్‌పాత్‌పై పడుకున్న చిన్నారిని ఎత్తుకొచ్చానని పోలీసులు విచారణలో చెప్పడం తెలిసిందే.  

అయితే పాప ఎవరు అన్న  విషయంలో ఎన్నో మిస్టరీలు ఉన్నాయి. పాప కిడ్నాప్ అయిన  సమయంలో తల్లిదండ్రులు చుట్టు ప్రక్కల వెతకడం కానీ, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కాని జరగలేదు. అంటే నిజంగా ఆ పాప వారి బిడ్డేనా? లేక  బెగ్గింగ్ మాఫియా.. ఆ  పాపను ఎక్కడినుంచైనా ఎత్తుకొచ్చిందా? ఒకవేళ  పాపను ఎత్తుకెళ్లారని  కంప్లైంట్ ఇస్తే.. పాప తమ పాప కాదని పోలీసులకు తెలిసి పోతుందని వారు భయపడ్డారా?

రాచకొండ పోలీసులు బోయగూడ వద్ద ఆరా తీసినా ఎవ్వరూ బిడ్డను పోగొట్టుకున్నట్లు చెప్పలేదు. దీనితో  ఆ బిడ్డను బెగ్గింగ్ మాఫియా  కచ్చితంగా ఎక్కడి నుంచి  ఎత్తుకొచ్చిందని పోలీసులు అనుమానిస్తున్నారు. బోయిగూడ ఫుట్ పాత్‌పై నివసిస్తున్న కుటుంబాలను కూడా పోలీసులు విచారిస్తున్నారు.  విచారణ  ముగిసిన అనంతరం  ఆ బిడ్డ ఎవరనేది  బయటపడే అవకాశం ఉంది.