దళితుణ్ని భుజాలపై మోయనున్న చిలుకూరి పూజారి.. - MicTv.in - Telugu News
mictv telugu

దళితుణ్ని భుజాలపై మోయనున్న చిలుకూరి పూజారి..

April 16, 2018

దళితులపై సాగుతున్న వివక్షను రూపుమాపేంందుకు కీలక చర్య తీసుకుంటున్నట్లు చిలుకూరి బాలాజీ దేవస్థానం ప్రధానార్చకులు రంగరాజన్ తెలిపారు. ఈ రోజు సాయంత్రం తాను ఒక దళితుణ్ని భుజంపై మోసుకుని ఆలయ ప్రవేశం చేస్తానని ఆయన ప్రకటించారు. హైదరాబాద్ జియాగూడలోని శ్రీరంగనాథ స్వామి ఆలయంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.భగవాన్ రామానుజల సహస్రాబ్ది జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. సహస్రాబ్ది మునివాహన ఉత్సవంలో అంతరాలు లేని సమాజాన్ని కాంక్షిస్తూ… తన భుజాలపై ఒక దళితుడ్ని మోసుకుని  ఆలయం ప్రవేశం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రెండు వేల ఏళ్ల క్రితం నాటి లోకసారంగ- తిరుప్పాణాళ్వార్ వృత్తాంతాన్ని గుర్తు చేస్తూ ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నామని రంగరాజన్ తెలిపారు.