స్టైల్ అదిరిపోయింది.. జీతం తగ్గిపోయింది.. - MicTv.in - Telugu News
mictv telugu

స్టైల్ అదిరిపోయింది.. జీతం తగ్గిపోయింది..

March 17, 2018

‘నువ్వు చాలా అందంగా ఉన్నావు.. నీ స్టైల్ సూపరెహె..’ అని అంటే మీరెలా ఫీల్ అవుతారు? ఎగిరి గంతేస్తారు కదా. అయితే ఇలాంటి ప్రశంసలు ఓ వ్యక్తి జీతానికి కోత పెట్టాయి. అందం, స్టయిలిష్ నడక అతనికి పేరుతోపాటు ఇబ్బందులూ తెచ్చిపెట్టింది. చైనాలోని షాంఘై విమానాశ్రయంలో జరిగింది ఈ చిత్రం.


విమానాశ్రయంలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న వ్యక్తి చూడ్డానికి హాలీవుడ్ హీరోలా ఉంటాడు. ఇటీవల ఎయిర్‌పోర్ట్‌లో ఓ విమానం మొరాయించడంతో మరమత్తులు చేయడానికి అధికారులు అతన్ని పిలిపిచారు. అయితే ఆ సోగ్గాడు.. టెక్నీషియన్ దుస్తుల్లో కాకుండా హీరోలా జీన్స్ ధరించి, సన్ గ్లాసెస్ ,హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ చాలా స్టైల్‌గా నడుచుకుంటూ వచ్చాడు. ఆయనను గమనించిన ఓ ప్రయాణికుడు వెంటనే  ఆ తతంగాన్ని వీడియో తీసి, సోషల్ మీడియాలో పడేశాడు. లక్షల మంది దాన్ని చూడ్డంతో అతడు ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. అయితే ఓ టెక్నీషియన్‌ నిబంధనలకు విరుద్ధంగా ఇలా స్టైల్‌గా జీన్స్‌ ప్యాంట్‌ వేసుకోవడమేంటని యాజమాన్యం ఆగ్రహించింది. అతని జీతంలో పది శాతం కోత విధించింది.

అయితే అతడు పెద్దగా బాధపడ్డం లేదు. ‘హేయ్.. చాలా సంతోషంగా ఉంది. అతి తక్కువ సమయంలో ఇంత ఫేమస్‌ అవడం సులువేం కాదు. నా కంపెనీ చేసిన దాంట్లో ఏ తప్పూ లేదు. డ్రెస్‌ కోడ్‌, ప్రవర్తన విషయంలో నేను చేసింది తప్పే. అదే సమయంలో నా వీడియోకు వచ్చిన స్పందన చూసి చాలా సంతోషించాను’ అని తెలిపాడు.