బ్రహ్మపుత్ర నదిని నల్లకాటేసిన చైనా... - MicTv.in - Telugu News
mictv telugu

బ్రహ్మపుత్ర నదిని నల్లకాటేసిన చైనా…

November 29, 2017

చైనా విషం చిమ్మింది. బ్రహ్మపుత్ర నదిలో నీళ్ళు నల్లగా, బురదమయంగా మారాయి. కొబ్బరినీళ్ళలా స్వచ్ఛంగా ఉండిన  నీళ్ళిప్పుడు కాళ్ళు కడుక్కోవటానికి కూడా పనికి రానంత మురికిగా మారిపోయాయి. స్వచ్ఛతకు మారుపేరుగా నిలిచిన ఆ నది ఇప్పుడు కాలుష్యపు బురద వాగుగా మారటానికి కారణం చైనా దేశమే అంటున్నారు అరుణాచల్ ప్రదేశ్ ఈస్ట్ సియాన్ జిల్లా అధికారులు. శతాబ్దాలుగా అరుణాచల్ ప్రదేశ్ ప్రజలకు బతుకుదెరువుగా మారిన జీవనది, ఇవాళ మురికి వాగులా మారిందని ఆందోళన చెందుతున్నారు. అరుణాచల్‌లో ఈ నదిని సియాంగ్ అని పిలుస్తారు.

‘నదిలోని నీళ్ళు మొత్తం తాగటానికి వీలు లేకుండా సిమెంటు తెట్టులా మారిపోయాయి ’ అని ఈస్ట్ సియాంగ్ డిప్యూటీ కమిషనర్ టామ్యో టటక్ తెలిపారు.

ఈ నది చైనా, టిబెట్, భారత్ మీదుగా 1,600 కిలోమీటర్లు ప్రవహిస్తోంది. చైనా పరిధిలోని ఈ నది నీటిని మళ్లించటానికి 1,000 కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణం జరుగుతోంది. దీంతో బురద, సిమెంట్ నదిలోకి మళ్ళీ  ఇలా నది నీళ్ళు పాడయ్యాయి. తొలుత ఇది సహజమైన బురద వల్ల జరిగిందేమో అనుకున్నాం. కానీ  చేపలు భారీస్థాయిలో చనిపోవడంతో, ఇది చైనా పనే అనుకున్నామని అంటున్నారు సియాన్ అధికారులు.