న్యూడ్ ఫోటోలకు అప్పులిస్తారు.. - MicTv.in - Telugu News
mictv telugu

న్యూడ్ ఫోటోలకు అప్పులిస్తారు..

December 6, 2018

రుణాలు ఇచ్చేటప్పుడు బంగారం, భూమి, పాత్రలను లేదా వివిధ స్థిరాస్తులను పూచికత్తు కింద పెట్టుకుంటారు. కానీ చైనాలోని ఒక సంస్థ అమ్మాయిలు నగ్నంగా దిగిన ఫోటోలను హామీగా తీసుకుంటున్నది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ వార్త చైనాలో సంచలనం అవుతోంది. అమ్మాయిలకు ఈ విధమైన ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తున్న స్కామ్ తీవ్ర కలకలం రేపుతోంది. చైనీస్ ఈ-కామర్స్ పేరిట ఏర్పడిన ఓ స్టార్టప్ సంస్థ ఈ రకమైన వ్యాపారం సాగించింది.Telugu News china e - commerce providing education loans for girls nudes photosవిద్యాభ్యాసం కోసం తగినంత డబ్బులేని వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని, వారి నుంచి నగ్న ఫోటోలు స్వీకరించి, రుణాలను ఇచ్చింది. భవిష్యత్తులో వారు తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించడంలో విఫలమైతే, వాటిని బయట పెడతామని బెదిరించడం ఈ సంస్థ ఉద్దేశం. ఇక రోజువారీ ఖర్చులు, కాలేజీ ఫీజుల కోసం ఎంతోమంది అమ్మాయిలు వీరి వలలో చిక్కుకుని, తమ ఫోటోలను తామే వారికి అందించి, అధిక వడ్డీకి అప్పులు తీసుకున్నారని తెలిసింది. చైనా ఆర్థిక నిబంధనలకు విరుద్ధంగా ఈ వ్యవహారం సాగుతూ ఉండటం, విషయం బయటకు తెలిసి, నిరసనలు వస్తుండటంతో అధికారులు రంగంలోకి దిగారు. సంస్థ లావాదేవీలపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.