వోయ్ చైనా..మారాష్ట్రపతి మాఅరుణాచల్‌ప్రదేశ్ - MicTv.in - Telugu News
mictv telugu

వోయ్ చైనా..మారాష్ట్రపతి మాఅరుణాచల్‌ప్రదేశ్

November 20, 2017

చైనాలో కాదు నాయనా  మారాష్ట్రపతి పర్యటించింది, అరుణాచల్‌ప్రదేశ్‌లో, ఈ సంగతి చైనా మరిచినట్టుంది. భారత్ భూభాగంలో ఉన్న అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతి కోవింద్  పర్యటిస్తే, చైనా విదేశాంగ మంత్రి స్పందించడం విడ్డూరంగా ఉంది. అసలు విషయానికి వస్తే రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌  అరుణాచల్‌ ప్రదేశ్‌ను పర్యటించారు.

అయితే  రాష్ట్రపతి పర్యటనను తప్పుబడుతూ ’ఆ ప్రాంతంలో భారత నాయకుడు జరిపిన కార్యకలాపాలను చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం’అని  చైనా విదేశాంగశాఖ మంత్రి కాంగ్‌ తెలిపారు. అరుణాచల్‌ప్రదేశ్‌ తమదేనని చైనా మొండిగా వాదిస్తున్న సంగతి తెలిసిందే. అరుణాచల్‌ ప్రదేశ్‌లో భారత నాయకులు ఎవరూ పర్యటించినా చైనా విమర్శిస్తూనే ఉంది.

ఇంతకు ముందే  కేంద్ర రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌లో పర్యటించినప్పుడు కూడా చైనా ఇలాగే తప్పుబట్టింది. కయ్యానికి కాలు దువ్వేటట్టు చేస్తున్న  చైనాతో భారత్ సంబంధాలు మెరుగుపడే అవకాశాలు ఇప్పట్లో లేవని పలువురు అభిప్రాయపడుతున్నారు.