11 అంతస్తు నుంచి దూకిన మహిళ.. కిందున్న గార్డు కూడా మృతి - MicTv.in - Telugu News
mictv telugu

11 అంతస్తు నుంచి దూకిన మహిళ.. కిందున్న గార్డు కూడా మృతి

December 16, 2017

ఓ మహిళను కాపాడే ప్రయత్నంలో సెక్యూరిటీ గార్డు అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటన చైనాలోని షాంక్సి ప్రాంతంలో జరిగింది.  కుటుంబ కలహాల వల్ల ఒక మహిళ  భవనంలోని  11వ  అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది..


ఆమె దూకుతున్నప్పుడు చూసిన సెక్యూరిటీ గార్డును ఆమెను రక్షించడానికి చేతులు పైకెత్తి పట్టుకున్నాడు. మహిళ అంత ఎత్తు నుంచి పడిపోవడంతో ఆ విసురుకు సెక్యూరిటీ గార్డు కూడా ఆమెతోపాటు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో నమోదయ్యాయి. మృతుడు లీ  అపార్ట్‌మెంట్‌లో ఐదేళ్లుగా సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్నాడు