మన వస్తువులంటే మనకు ఇష్టం ఉంటుంది. ఉండాలి కూడా. కానీ కొన్నిచోట్ల మాత్రం కాసింత సేపు ప్రేమ వదులుకోవాలి. లేకపోతే పరువు పోతుంది. తన హ్యాండ్ బ్యాగుపై విపరీతమై ప్రేమ ఉన్న మహిళ ఈ సూత్రం తెలుసుకోకుండా చిక్కుల్లో పడిపోయింది.దక్షిణ చైనాలోని గ్వాంగ్ డాంగ్ ప్రావిన్సులోని రైల్వే స్టేషన్లో ఈ ఉదంతం జరిగింది. స్టేషన్లో అందరి వస్తువులను తనిఖీ చేస్తున్న రైల్వే అధికారులు ఒక మహిళ వస్తువులను చెక్ చేయబోయారు. ఆమె బ్యాగును, హైహీల్స్ వంటి వాటిని మాత్రమే తనిఖీ చేస్తామన్నారు. అయితే ఆమెకు బ్యాగును వారికివ్వడం ఇష్టం లేదు. బ్యాగు, హైహీల్స్‌తో పాటు ఎక్స్‌రే మెషిన్‌లోకి వెళ్లింది. దాంతో అధికారులు కంగారు పడ్డారు. ఆమె జాగ్రత్తగా బయటకు వస్తుందో లేదో అని అని భయపడ్డారు. కాసేపటి తర్వాత సదరు మహిళ మెషిన్ నుంచి క్షేమంగా బయటికి రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు చేయొద్దంటూ ఆమె ఎక్స్‌రే ఇమేజ్‌లు మీడియాకు విడుదలచేశారు.