mictv telugu

పైలెట్‌పై వేటు.. 6 నెలలు ఇంట్లో  ముద్దులాడుకో…

January 11, 2019

 భార్యపై ప్రేమ ఉండాల్సిందే. కానీ దానికీ మితి ఉంటుంది. ఈ విషయం తెలియక ఓ పైలెట్ చిక్కుల్లో పడ్డాడు. నిబంధనలకు విరుద్ధంగా విమానం కాక్‌పిట్‌లోకి భార్యను తీసుకుని వెళ్లి ముద్దూముచ్చటకు పాల్పడ్డాడాడు. దీంతో  అతడిపై ఆరు నెలల సస్పెన్షన్ వేటు పడింది.చైనాలో షెంజెన్‌కు చెందిన డాంఘై ఎయిర్‌లైన్స్‌ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. చెన్ అనే పైలట్ గత సంవత్సరం జూలై 28న తన భార్యను కాక్‌పిట్‌లోకి తీసుకెళ్లాడు. ఇలా రెండుసార్లు తన భార్యను కాక్‌పిట్‌లోకి తీసుకెళ్లడంపై విమానయాన సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Telugu News Chinese airline pilot grounded for seating wife in cockpit .

తొలిసారి నాన్‌టాంగ్ నుంచి లాంఝౌ వెళ్తున్న విమానంలో, రెండోసారి లాంఝౌ నుంచి బీజింగ్ వెళ్తున్న విమానంలోని కాక్‌పిట్లలోకి భార్యను తీసుకెళ్లి కూర్చోబెట్టుకున్నాడు. భార్యకు టికెట్ తీసుకున్న చెన్ ప్రయాణం మొత్తం భార్యను తనతోపాటు ఉంచుకున్నాడు. చెన్ చర్యలను తీవ్రంగా పరిగణించిన విమానయాన సంస్థ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. భవిష్యత్తులో మరెవరూ నిబంధనలు మీరకూడదనే ఉద్దేశంతో చెన్‌పై ఆరు నెలల నిషేధంతోపాటు లక్ష రూపాయల జరిమానా విధించింది.

Telugu News Chinese airline pilot grounded for seating wife in cockpit