పాకిస్తాన్ వేశ్యల కోసం చైనీయుల క్యూ.. గొడవ - MicTv.in - Telugu News
mictv telugu

పాకిస్తాన్ వేశ్యల కోసం చైనీయుల క్యూ.. గొడవ

April 6, 2018

ప్రాంతీయస్థాయి అభివృద్ధి కోసం చైనా, పాకిస్తాన్ లు ఎకనాబిక్ కారిడార్ నిర్మాణాన్ని తలపెట్టాయి. భారత్‌కు వ్యతిరేకంగా చేతులు కలిపి ముందుకు సాగుతున్నాయి. ఈ కారిడార్ నిర్మాణం పనులు ఇటీవల వరకు సజావుగానే సాగాయి. తాజాగా పాకిస్తాన్ వ్యభిచార గృహాలకు సంబంధించిన గొడవ రెండు దేశాల మధ్యా చిచ్చుపెట్టింది. ‘డాన్’ పత్రిక కథనం ప్రకారం.. చైనా కార్మికులకు పాక్ పోలీసులు, సైనికులకు మధ్య గొడవలు రేగుతున్నాయి. చైనా కార్మికులు కొందరు పాక్‌లోని భవల్ పూర్, ఫైసలాబాద్ జాతీయ రహదారిపై ఉన్న రెడ్‌లైట్ ఏరియాకు క్యూ కడుతున్నారు.  కానీ పాక్ పోలీసులు వాళ్ళను మధ్యలోనే అడ్డుకుని, అక్కడ వారికి ప్రవేశం లేదని వెనక్కి పంపుతున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన చైనా కార్మికులు ‘ఇదేం స్నేహం ’ అని చిన్నబుచ్చుకుంటున్నారు. ఇరుపక్షాల మధ్య భౌతిక దాడులు కూడా గుతున్నాయి.

అంతటితో ఆగకుండా చైనా కార్మికులు పాకిస్థాన్ గార్డులు సేదదీరే ప్రాంతానికి వెళ్లే విద్యుత్ లైన్లను తొలగించారు. చైనా ఇంజనీర్లు క్యాంపస్‌ను వదిలి వెళ్లేందుకు వీలులేదని, వారిని సెక్స్ వర్కర్ల వద్దకు వెళ్లనివ్వబోమని సైన్యం స్పష్టం చేశారు. నిరసనలకు దిగిన కార్మికులు, పనులను ఆపేసి గొడవకు దిగారు. కుర్చీలు, బల్లలు సహా దొరికిన పరికరాలు తీసుకుని వారిపై దాడి చేశారు. ఈ ఘటనలో కొందరు సైనికులకు గాయాలు అయ్యాయి. భారీ యంత్ర సామానులను రోడ్లపైకి తెచ్చి ట్రాఫిక్‌కు అవాంతరాలు కలిగించిన చైనా కార్మికులు, పోలీసుల వాహనాలపైకి ఎక్కి నినాదాలు చేశారు.
తమపై పాక్ సైన్యం దాడులకు ఎగబడుతోందని, ఇదే పరిస్థితి కొనసాగితే, తాము పనులు మానేస్తామని చెబుతూ పాక్ ప్రభుత్వానికి లేఖ రాశారు. కొందరు చైనా కార్మికులు.. దొంగచాటుగా పాక్ వేశ్యలను తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలపై చైనా, పాక్  ప్రభుత్వాలు ఇంకా స్పందించకపోవటం విశేషం.