డబ్బు దోచుకుని విసిరేసిన కోతి - MicTv.in - Telugu News
mictv telugu

డబ్బు దోచుకుని విసిరేసిన కోతి

February 19, 2018

అల్లరి చేష్టలకు పెట్టింది పేరు కోతి. అవి జనాన్ని నానా ఇబ్బందులకు గురి చేస్తుంటాయని అందరకి తెలిసిందే. అయితే అలాంటి ఘటనే చైనాలో జరిగింది. ప్రస్తుతం ఆ  వానరం చేసిన చిలిపి పని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సిచువాన్‌లోగల మౌంట్ ఎమీకి చెందిన ఓ పార్క్‌లో   కోతి ఆ ప్రాంతానికి వచ్చిన ఒక టూరిస్టు నుంచి పర్సు కొట్టేసింది. 
పర్స్‌తో సహా సమీపంలోని రైలింగ్ మీద కూర్చుని, డబ్బులను విసిరివేసింది. దానికి పండు విలువ తెలుసు గానీ పైసా విలువ దానికేం తెలుసు ? అందుకే ఆ పర్స్‌లో ఉన్న డబ్బును చిత్తు కాగితాలు అనుకొని గాలికి విసిరి పారేసింది. తరువాత ఖాళీ అయిన పర్సును కిందపడేసి పారిపోయింది. కోతి అలా చేస్తున్న అల్లరిని పనిని అక్కడనున్న ఒక టూరిస్ట్ తన మొబైల్‌‌లో బంధించాడు.