గుండుకు, పొట్టివీరయ్యకు చిరు సాయం - MicTv.in - Telugu News
mictv telugu

గుండుకు, పొట్టివీరయ్యకు చిరు సాయం

December 18, 2017

150కి పైగా చిత్రాల్లో నటించి సినిమాల్లో మెగాస్టార్ అనిపించుకున్న  చిరంజీవి, బయట రియల్ స్టార్ అనిపించుకున్నాడు. సినిమాల్లో అందరినీ నవ్వించే గుండు హనుమంతరావు, పొట్టి వీరయ్యలు కష్టాల్లో ఉన్నారని తెలిసి చెరో రెండు లక్షల ఆర్థిక సాయం చేశాడు చిరంజీవి.

గుండు హనుమంతరావు గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న చిరు, ఆయన వైద్యం కోసం రూ. 2 లక్షల రూపాయల చెక్కును ‘మా’అసోసియేషన్‌కు పంపించారు. మా అధ్యక్షుడు శివాజీరాజా కొంతమంది సభ్యులు కలిసి హాస్పిటల్‌కు వెళ్లి గుండు హనుమంతరావుకు చెక్కును అందజేశారు.  పొట్టి వీరయ్య కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని  తెలుసుకున్న చిరు అతనికి కూడా రెండు లక్షల సాయం చేశాడు.