తెలుగులో అమితాబ్ ట్వీట్.. అర్థమేంటో! - MicTv.in - Telugu News
mictv telugu

తెలుగులో అమితాబ్ ట్వీట్.. అర్థమేంటో!

March 29, 2018

‘సైరా’ చిత్రంలో బిగ్‌బి అమితాబ్ బచ్చన్ నటిస్తారనే వార్తలు వస్తున్నాయి. వాటిని నిజం చేస్తూ అమితాబ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చిరంజీవి కోరినందునే తాను ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించినట్టు అమితాబ్ గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న ‘సైరా’ చిత్రం షూటింగ్ లో పాల్గొనేందుకు హైదరాబాద్ చేరుకున్న అమితాబ్ బచ్చన్ తెలుగులో ట్వీట్ చేయటం గమనార్హం.‘సూపర్ స్టార్ చిరంజీవి అదే ఫ్రేమ్‌లో ఒక గౌరవం వుండాలి ’ అని స్టేటస్ పెట్టి,  సినిమాలో తన లుక్‌కు సంబంధించి ఓ ఫొటోను కూడా ఉంచారు. ఫోటోలో అచ్చం రవీంద్ర నాథ్ ఠాగూర్ మాదిరి వున్నారు. నేటి నుంచి సైరా షూటింగ్‌లో పాల్గొంటారు అమితాబ్. ఈ సినిమాలో అమితాబ్ నటించటంపై సర్వత్రా ఆసక్తి నెలకొని వుంది.

అయితే అమితాబ్ ట్వీట్‌కు అర్థమేంటో తెలియడం లేదని నెటిజన్లు జుత్తు పీక్కుంటున్నారు. చిరంజీవితో కలసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించడాన్ని ఆయన గౌరవంగా భావిస్తున్నారని కొంతమంది వివరణలు ఇస్తున్నాయి. అయితే గూగుల్ ట్రాన్స్ లేటర్ వంటి ద్వారా ఆయన తను అనుకున్నది అనువాదం చేసుకుని ఉంటారని, అందుకే అర్థకం కావడం లేదని కొందరు, ఆయన ఇంగ్లిష్‌లో ట్వీటింటే చక్కగా అర్థమయ్యేది కదా, రాని తెలుగులో ఎందుకీ పాట్లు అని కొందరు బుగ్గలు నొక్కుకుంటున్నారు.