చిరు ఫిల్టర్ కాఫీ కావాలా నాయనా? - MicTv.in - Telugu News
mictv telugu

చిరు ఫిల్టర్ కాఫీ కావాలా నాయనా?

December 1, 2017

కొందరు తమకు నచ్చిన హీరో ,హీరోయిన్ల పేర్లతో రకరకాల ఆహార పదార్థాలను తయారు చేస్తుంటారు. వినియోగదారులను ఆకట్టు కోవడానికి  వారి పేరిట రెస్టారెంట్లు కూడా ఒపెన్ చేస్తుంటారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి పేరు మీద ఓ ఫిల్టర్ కాఫీ రానుంది.

 ఈకాఫీకి చిరు పేరుని అభిమాని పెట్టాడని అనుకునేరు. కాదు. స్వయాన చిరు కోడలు ఉపాసన ‘ అపోలో పౌండేషన్ ’ తరుపున ఈ కాఫీ షాప్‌ను ప్రారంభించింది. జూబ్లీహిల్స్ లోని అపోలో ఎఫ్ఎన్డీ థియేటర్ వద్ద  ‘థియేటర్  కేఫ్’ ను  ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభించింది.ఈ కేఫ్ లో చిరు ఫిల్టర్ కాఫీ, హైదరాబాద్ కేసర్ రోస్ టీ, టుఖ్మి చికెన్ ,లామకాన్ వరల్డ్ ఫేమస్ సయోసా, మిర్చి బజ్జీ లభించనున్నాయి.