చుడీదార్‌‌లో అమ్మవారు.. భక్తుల రచ్చరచ్చ... - MicTv.in - Telugu News
mictv telugu

చుడీదార్‌‌లో అమ్మవారు.. భక్తుల రచ్చరచ్చ…

February 6, 2018

దేవతలు పట్టు చీరలు, వజ్ర వైఢూర్యాలు, పగడాలు పొదిగిన నగలు ధరిస్తారు. కానీ అందుకు విరుద్ధంగా తమిళనాడు నాగపట్నం జిల్లాలోని ఆలయంలో అమ్మవారికి చుడీదార్ అలంకరణ చేశారు అర్చకులు. రాజ్, కల్యాణం అనే ఇద్దరు అర్చకులు ఈ పనికి పూనుకున్నారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టి వివాదానికి దారి తీసింది.

నాగపట్నం జిల్లా మయిలాడుదురైలో తిరువావడుదురై ఆధీనానికి చెందిన అభయాంబికా సమేత శ్రీమయూరనాథ ఆలయం ఉంది. శుక్రవారం అమ్మవారికి చందన అలంకారం చేశారు. సాయంత్రం చుడీదార్ ధరింపజేసి పూజలు చేశారు.  పూజాలు ఇలా చేయాలని ఎవరు చెప్పారో తెలియడం లేదు. ఈ అలంకరణపై భక్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఆగమ నియమాలకు విరుద్ధంగా అలంకరించిన అర్చకులను తిరువావడుదురై ఆధీనం సోమవారం సస్పెండ్‌ చేసింది. ‘ఇదేం పని నాయనా.. దేవుళ్ళను ఇలా అవమానించడం సబబు కాదని ’ నెటిజనులు కామెంట్లు చేశారు. అయితే కొందరు భక్తులు మాత్రం పూజారులను సమర్థిస్తున్నారు. చుడీదార్ కూడా భారతీయ సంప్రదాయమేనని, ఉత్తరాది మహిళులు ధరిస్తున్న నేపథ్యంలో అమ్మవారిని అలా అలంకరించడం తప్పేమీ కాదని అంటున్నారు.