బండ్ల గణేశ్‌కు కాంగ్రెస్ ‘కీలక’ పదవి..

అతి చేసి అభాసుపాలైన సినీ నిర్మాత బంగ్ల గణేశ్‌ను కాంగ్రెస్ పార్టీ బుజ్జగిస్తోంది. రాజేంద్రనగర్ టికెట్ రాకపోవడంతో అసహనం వ్యక్తం చేసిన గణేశ్ను పార్టీ అధికార ప్రతినిధిగా నియమించింది.Telugu news cine producer Bandla Ganesh appointed as Congress Spokesperson after denying Rajendra Nagar ticket for Telangana assembly Elections పవన్ కల్యాణ్ అనుచరుడైన గణేశ్ కాంగ్రెస్ పార్టీలో చేరి షాకివ్వడమే కాకుండా, టీవీ చానల్ కార్యక్రమంలో ఉత్తుత్తి ఎమ్మెల్యేగా కూడా ప్రమాణం చేసి కలకలం రేపారు. రాజేంద్ర నగర్ టికెట్ తనదేనని గొప్పలు పోయారు. ఈ అతి ప్రవర్తనో లేకపోతే ఆశావహుల మధ్య పోటీ, ఇతర కారణాలో తెలయిదు గాని అధిష్టానం అతనికి జెల్లకొట్టింది.  మహాకూటమి ఒప్పందంలో భాగంగా స్థానాన్ని టీడీపీకి కేటాయించింది. అక్కడ గణేశ్ గుప్తా పోటీ చేస్తున్నారు. దీంతో గణేశ్ పార్టీ మారతారనే ఊహాగానాలు కూడా వచ్చాయి. అతడు జంప్ చేయకుండా కాంగ్రెస్ తన అధికార ప్రతినిధి పదవి కేటాయించింది. దీనిపై అతడింకా స్పందించలేదు.

rrr