మార్చి నుంచి సిన్మా టాకీస్లు బంద్! - MicTv.in - Telugu News
mictv telugu

మార్చి నుంచి సిన్మా టాకీస్లు బంద్!

December 16, 2017

రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్చి నుంచి సిన్మా టాకీస్లు బంద్ కాబోతున్నాయా? ఏమో తెలుగు ఫిలిం ఛాంబర్స్ వాళ్లు తీసుకున్న నిర్ణయం చూస్తే అలాగే అనిపిస్తుంది.

డిజిటల్ సర్వీస్  ప్రొవైడర్లు అధిక ఛార్జీలు వసూలు చేస్తుండడంతో భారీగా నష్టపోతున్నామని సినిమా డిస్ట్రిబ్యూటర్స్  నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆ ఛార్జీలను వెంటనే తగ్గించాలి లేకపోతే సమ్మె చేయడంతో పాటు, మార్చి నుంచి సిన్మా థియేటర్లను బంద్ పెడతాం అంటూ హెచ్చరించారు. డిజిట‌ల్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లతో ఉన్న స‌మ‌స్యపై  టీఎఫ్‌సీసీ ఎప్పటినుంచో వ్యతిరేక‌త చెబుతోంది.

ప్రస్తుతం ఒక సినిమా డిజిట‌ల్ ప్రద‌ర్శన కోసం డిజిట‌ల్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లకు వారానికి రూ. 20,000లు చెల్లిస్తున్నాం.  డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు..త‌మ ప‌రిక‌రాల‌ను ఎగ్జిబిట‌ర్‌కి అంద‌జేస్తున్న కార‌ణంగా ఈ అధిక ఛార్జీల‌ను ఎగ్జిబిట‌ర్ గానీ, వారే కాని భరించాలి.

కానీ అన్యాయంగా డిస్ట్రిబ్యూటర్ల మీద వేస్తున్నారు. అందుకే అధిక చార్జీలు తగ్గించకపోతే  మార్చి నుంచి ఏ ఒక్కసినిమాకూడా తెలుగు రాష్ట్రాల్లో ఆడవని స్పష్టం చేశారు. దీనితో మార్చిలో విడుదల చేద్దామనుకున్న సినిమాల పరిస్థితి ఏంటని  నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు.