శ్రీదేవి మృతిపై అనుమానాలొద్దు.. గుండెపోటే కారణం - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీదేవి మృతిపై అనుమానాలొద్దు.. గుండెపోటే కారణం

February 26, 2018

నటి  శ్రీదేవి గుండెపోటుతోనే మరణించిందని, ఆమె మృతిపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని దుబాయ్ వైద్యులు వెల్లడించారు. ఆమె మృతికి సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికను డాక్టర్ల బృందం విడుదల చేసింది. అందాల తార శ్రీదేవి మరణం సహజ మరణం కాదనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆమె చనిపోయి 36 గంటలు గడుస్తున్నా, ఆమె భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న సందర్భంలో దుబాయ్ డాక్టర్లు క్లారిటీ ఇచ్చారు.

మరికొద్ది సేపట్లో శ్రీదేవి మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. ఆమె మృతదేహానికి మరోసారి పోస్టుమార్టం చేయనున్నారనే వార్తలను అధికారులు కొట్టి పారేశారు. శ్రీదేవి విదేశంలో మరణించడం వల్లే ఈ జాప్యం జరుగుతోందని తెలుస్తోంది.