కేసీఆర్ కోసం రూ. 7కోట్ల  బస్సు... - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ కోసం రూ. 7కోట్ల  బస్సు…

March 6, 2018

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రత కోసం అత్యాధునిక బుల్లెట్ ప్రూఫ్ బస్సును కోనుగోలు చేయాలని హోంశాఖ నిర్ణయించింది.  గత శుక్రవారం తెలంగాణ ,చత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో పోలీసులకు, మావోస్టులకు మధ్య జరిగిన ఎదరుకాల్పుల్లో 10మంది మవోస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే.  ఈ ఘటన తర్వాత టీఆర్ఎస్ నేతలే మా లక్ష్యమంటూ మవోయిస్టు అగ్రనేతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సమావేశం అయిన హోంశాఖ కేసీఆర్ భద్రత కోసం మరో బుల్లెట్ ప్రూఫ్ బస్సును కొనుగోలు చేయాలని నిర్ణయించింది.  

రూ.7కోట్లకు పైగా ఖరీదైన ఈ వాహనాన్ని నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో పర్యటనకు వినియోగిస్తారని సమాచారం. ఇప్పటికే ఈ బస్సు ఎలా ఉండాలనే దానిపై ఎనిమిది మందితో కూడిన కమిటీ ప్రణాళికలు రూపొందిస్తోంది. మరికొద్ది నెలల్లోనే కొత్త బస్సులో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు.

మూడేళ్ల క్రితమే కేసీఆర్ కోసం తెలంగాణ ప్రభుత్వం రూ. 4 కోట్లు వెచ్చించి ఓ బుల్లెట్ ప్రూఫ్ బస్‌ను కొనుగోలు చేసింది. అయితే ఈ బస్‌‌ కంటే మెరుగైన భద్రత సదుపాయాలు ముఖ్యమంత్రికి కల్పించాలనే ఉద్దేశంతో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త బస్ కొనుగోలు బాధ్యతని రోడ్డు, భవనాల శాఖకి అప్పగించారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ హెలికాప్టర్‌ని వినియోగించినా  జిల్లాల పర్యటనలో ఎక్కువగా బస్‌నే వినియోగిస్తున్నారు.