ప్రతికూల వాతావరణం.. చింతమడకకు కారులోనే కేసీఆర్

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాసేపట్లో మెదక్ జిల్లాలోని తన స్వగ్రామమైన  చింతమడకలో ఓటేయనున్నారు. షెడ్యూలు ప్రకారం ఆయన ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్ నుంచి హెలికాప్టర్లో భార్య శోభతో కలసి గ్రామానికి వెళ్లాల్సి ఉంది. అయితే వాతావరణం అనుకూలంగా లేదంటూ అధికారులు అనుమతివ్వలేదు.Telugu news CM KCR helicopter journey cancelled as bad weather and going in car to chintamadaka village to cast vote in Telangana assembly elections టేకాఫ్‌కు సమస్యలు ఎదురవుతాయని వారు చెప్పారు.  వాతావరణం సరిగ్గా లేదని, మంచు కురుస్తోందని చెప్పడంతో హెలికాప్టర్ ప్రయాణం రద్దయింది. రోడ్డు మార్గంలో కారులోనే చింతమడకు వెళ్లాలని సీఎం నిర్ణయించారు. ప్రస్తుతం ఆయన పోలింగ్ తీరును సమీక్షిస్తున్నారని, కాసేపట్లో చింతమడకు బయల్దేరతారని తెలుస్తోంది. కేసీఆర్