అయ్యో దీదీ.. అది మైక్ కాదు.. టార్చ్‌లైట్ - MicTv.in - Telugu News
mictv telugu

అయ్యో దీదీ.. అది మైక్ కాదు.. టార్చ్‌లైట్

December 3, 2017

మన రాజకీయ నాయకులకు స్టేజీ కింద జనాలు, స్టేజీ మీద మైకులు కనవడితే చాలు ఎక్కడా లేని ఊపు వస్తుంది.  స్పీచ్‌ల మీద స్పీచ్‌లతో దంచికొడుతుంటారు. ఇలాంటి సందర్భంలోనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కలకత్తాలో ఓ వింత అనుభవం ఎదురైంది. వేదిక కింద జనాలు సంతోషంతో కేకేలు వేస్తోంటే దీదీ సంబరపడిపోయారు. వాళ్లను తన మాటలతో అలరిద్దామనుకుని వెంటనే పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డు చేతిలో ఉన్న టార్చ్ లైటు లాగేసుకున్నారు. అదేమిటో సరిగ్గా చూసుకోకుండా దాని మూతి ముందు పెట్టేసుకుని మాట్లాడబోయింది. వెంటనే టార్చ్ లైట్ వెలుతురు ఆమె ముఖం మీద పడడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వారు. వెంటనే పక్కనే ఉన్నవాళ్లు టార్చ్‌లైట్‌ను తీసుకుని దీదీకి మైక్‌ను అందించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. టార్చ్‌లైట్‌ను కూడా మైక్‌గా మార్చే శక్తి ఒక్క దీదీకే ఉందని నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.