గజ్వేల్‌లో సియం మినీ క్యాంప్ ఆఫీస్ ప్రారంభం ! - MicTv.in - Telugu News
mictv telugu

గజ్వేల్‌లో సియం మినీ క్యాంప్ ఆఫీస్ ప్రారంభం !

March 8, 2018

సిద్దిపేట జిల్లాలో కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న  గజ్వేల్‌లో ముఖ్యమంత్రి మినీ క్యాంప్ ఆఫీస్‌ను ఇరిగేషన్ మంత్రి హరీష్ రావ్ ప్రారంభించారు. కొత్తగా నిర్మితమైన ఈ క్యాంప్ ఆఫీసులో ప్రత్యేక పూజలు నిర్వహించారు హరీష్ రావ్.

ఈ కార్యక్రమానికి హరీశ్ రావ్‌తో పాటు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇకనుంచి ప్రజల సమస్యలను పరిష్కరించడానికి అధికారులతో ప్రగతి భవన్’లోనే కాదు, గజ్వేల్‌లో ప్రారంభమైన  ఈ మినీ క్యాంపులో కూడా కేసీఆర్ భేటీ అవుతారన్నమాట.