నో డౌట్.. మళ్లీ మాదే అధికారం.. కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

నో డౌట్.. మళ్లీ మాదే అధికారం.. కేసీఆర్

December 7, 2018

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌దే విజయమని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఆయన చింతమడకలో భార్య శోభతో కలసి ఓటేసిన తర్వాత విలేకర్లతో మాట్లాడారు. ప్రజలకు తమవైపే ఉన్నారని, మళ్లీ పట్టం కట్టబోతున్నారని అన్నారు.Telugu news CM TRS chief KCR affirms win in Telangana assembly elections with huge majority no doubt on that‘మేం అధికారాన్ని నిలబెట్టుకుంటాం. ప్రభుత్వ అనుకూల పవనాలు వీస్తున్నాయి.. సందేహం లేదు. భారీ మెజారిటీతో విజయం సాధిస్తాం.  హైదరాబాద్లోనూ సీట్లు సాధిస్తాం. ఈసారి పోలింగ్ శాతం కూడా పెరగనుంది.  తప్పకుండా మేమే గెలుస్తాం.ఎగ్జిట్ పోల్ ఫలితాలు సాయంత్రం మీరే చూస్తారు. ముఖ్యంగా వృద్ధులు ఓటు వేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని కేసీఆర్ చెప్పారు.