చింతమడకలో ఓటేసిన కేసీఆర్ దంపతులు - MicTv.in - Telugu News
mictv telugu

చింతమడకలో ఓటేసిన కేసీఆర్ దంపతులు

December 7, 2018

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్వగ్రామమైన చింతమడకలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 12.30 గంటల ప్రాంతంలో కేసీఆర్, ఆయన సతీమణి శోభ జెడ్సీ స్కూల్లో ఓటేశారు. తర్వాత బయటికొచ్చి వేలి సిరా గుర్తు చూపారు.Telugu news CM TRS chief KCR, wife shobha cast vote in Chintamadaka village in Telangana assembly electionsఅంతకు ముందు ఆయన ఎర్రవల్లిలోని ఫాంహౌస్ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్లో చింతమడక చేరుకున్నారు. మొదట హెలికాప్టర్ టేకాఫ్‌కు ప్రతికూల వాతావరణ వల్ల అనుమతివ్వని అధికారులు మధ్యాహ్నం వాతావరణం అనుకూలించడంతో అనుమతిచ్చారు.  కేసీఆర్ దంపతుల వెంట మంత్రి హరీష్రావు, టీఆర్ఎస్ సీనియర్ నేతలు చింతమడక వెళ్లారు. ఓటేసిన తర్వాత కేసీఆర్ తన బాల్యమిత్రుడైన సత్యనారాయణ గౌడ్ నివాసంలో ఆతిథ్యం స్వీకరించి, తిరిగి ఫాంహౌస్కు రానున్నారు. కేసీఆర్ గత ఎన్నికల్లోనూ చింతమడకలోనే ఓటేశారు. చింతమడకలో మొత్తం 1702 ఓట్లు ఉండగా, ఒంటిగంటకు 50 శాతంపైగా ఓటు హక్కు వాడుకున్నారు.