కేసీఆర్ ప్రధాని కావాలని అజ్మీర్‌లో డిప్యూటీ సీఎం.. - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ ప్రధాని కావాలని అజ్మీర్‌లో డిప్యూటీ సీఎం..

March 9, 2018

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకురాలని,  ఆయన ఈ దేశ ప్రధానమంత్రి అవ్వాలని కోరుతూ రాజస్థాన్‌లోని ప్రఖ్యాత అజ్మీర్ దర్గాలో నేడు తెలంగాణ డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఈ ప్రార్థనల్లో రాష్ట్ర హజ్ కమిటీ ఛైర్మన్ మహ్మద్ మసీఉల్లా, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ సయ్యద్ అక్బర్ హుస్సన్ పాల్గోంటారు.మరోపక్క.. టీఆర్ఎస్ నేతలు అజ్మీర్ కలెక్టర్‌తో సమావేశం కానున్నారు. తెలంగాణ నుంచి అజ్మీర్‌కు వెళ్లే భక్తుల కోసం అక్కడ గెస్ట్ హౌస్‌ను నిర్మించడానికి అవసరమైన స్థలంపై కలెక్టర్‌తో చర్చించే అవకాశం ఉంది. అనంతరం దర్గా దివాన్ ను కలిసి ప్రార్థనలను నిర్వహిస్తారు.