త్వరలో కోకా కోలా బీర్లు ! - MicTv.in - Telugu News
mictv telugu

త్వరలో కోకా కోలా బీర్లు !

March 8, 2018

ఇప్పటి వరకు కూల్ డ్రింక్ లనే తయారు చేసిన కోకా కోలా కంపెనీ ఇక నుండి బీర్లను కూడా తయారు చేయబోతుంది. టిన్నులలో ఉండే బీర్ల కోసం యువత ఎక్కవగా ఆకర్షణకు లోనవుతున్నారట. అందుకే యువతను ఆకర్షించేందుకు తాము కూడా బీర్ల తయారీ చేయనున్నట్లు కోకాకోలా స్పష్టం చేసింది.

125ఏళ్ల చరిత్ర కలిగిన కోకాకోలా మొదటి సారిగా ఈ బీర్లను తయారు చేయబోతుంది. జపాన్‌లో లభించే షోచు అనే స్పిరితో తయారు చేసే ఆల్కాహాలిక్ డ్రింక్స్ కు బాగా గిరాకీ ఉందట. అందుకే మొదట జపాన్ లోనే తమ బీర్ల విక్రయాలను మొదలు పెట్టనుంది కోకాకోలా. 2019 నాటికి  కోకాకోలా బీర్లు మన దేశానికి వస్తాయని సమాచారం.

ఈ బీర్లలో 3 నుంచి 8 శాతం ఆల్కాహాల్ ఉంటుందట. మరింకే ముందు ముందు ఎవరైనా సుట్టాలు మీ ఇంటికి వస్తే ఏం తాగుతవ్ అంటే కోకాకోలా అని చెబితే పుసుక్కున కూల్ డ్రింక్ తీసుకెచ్చెరు.. వాళ్లడిగేది బీరో.. కూల్ డ్రింకో ఒకటికి రెండు సార్లు కన్ఫామ్ చేసుకుని తీసుకురండి.