ఇద్దరు భారత ఆటగాళ్లపై నిషేధం... - MicTv.in - Telugu News
mictv telugu

ఇద్దరు భారత ఆటగాళ్లపై నిషేధం…

April 13, 2018

ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో  జరుగుతున్న కామన్‌వెల్త్ 2018లో ఇద్దరు భారత అథ్లెట్లపై నిషేధం విధించారు. ముందునుంచి పకడ్బందీగా అమలు అవుతున్న‘నో నీడల్ పాలసీ’ (సిరంజీల వాడకం నిషేదం) ఉల్లంఘించారు.  ఏవీ రాకేష్‌ బాబు, ఇర్ఫాన్‌ కొలొత్తమ్‌ థోడిల పైన కామన్‌వెల్త్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ (సీజీఎఫ్‌) నిషేధం విధించింది. వెంటనే ఇద్దరు క్రీడా గ్రామం విడిచి వెళ్లాలని నోటీసులు జారీ చేసింది.  రాకేష్ బాబు ట్రిపుల్ జంప్‌లో ,ఇర్ఫాన్ రేస్‌వాక్‌లో పాల్గొనాల్సి ఉంది.అంతేకాకుండా భారత బృందానికి నేతృత్వం వహిస్తున్న విక్రం సిసోడియా, జట్టు మేనేజర్‌ నామ్‌దేవ్‌ శిర్గావంకర్‌, అథ్లెటిక్స్‌ మేనేజర్‌ రవీందర్‌ చౌదరీలపై కూడా సీజీఎఫ్‌  తీవ్రంగా మండిపడింది. ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తే శిక్ష తప్పదని సీజీఎఫ్‌ ప్రెసిడెంట్‌ లూయిస్‌ మార్టిన్‌ ఒక ప్రకటనలో తెలిపారు.క్రీడా గ్రామంలో సిరంజీలు వాడొద్దనే నింబధనల్ని  భారత అథ్లెట్లు ఉల్లంఘించారని సీజీఎఫ్‌ తెలిపింది. దీనిని తాము యాంటీ డోపింగ్ నిబంధనల ఉల్లంఘనగా చూడలేదు. ఈ ఇద్దరూ ఆటగాళ్లు నీడిల్ ఉపయోగించకూడదన్న గేమ్స్ నిబంధనలను ఉల్లంఘించారని సీజీఎఫ్‌ తెలిపింది. ఒకవేళ డయాబెటిస్‌లాంటి వాటికోసం నీడిల్స్ ఉపయోగించాలనుకుంటే ముందుగానే అనుమతి తీసుకోవాలని సూచించింది. భారత ఆటగాళ్ల గదుల వద్ద వాడి పడేసిన సిరంజీలు బయటపడినపుడు తొలుత పెద్దగా పట్టించుకోని సీజీఎఫ్‌ కోర్టు, ఈ విషయంపై మళ్లి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంది.