కమెడియన్ విజయ్ ఆత్మహత్య - MicTv.in - Telugu News
mictv telugu

కమెడియన్ విజయ్ ఆత్మహత్య

December 11, 2017

తెలుగు సినీ కమేడియన్ విజయ్  యూసఫ్ గూడలోని తన ఇంటిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  అమ్మాయిలు-అబ్బాయిలు అనే సినిమాలో హీరోగా కూడా చేశాడు.  బొమ్మరిల్లు సినిమాలో హీరో సిద్దార్థ్ ఫ్రెండ్‌గా పిచ్చెక్కిస్తా అంటూ అందరికి దగ్గరయ్యాడు. ఆ తర్వాత కొన్ని చిన్న సినిమాల్లో కనిపించాడు. సినిమాల్లో అవకాశాలు రాకపోవడమే విజయ్ ఆత్మహత్యకు కారణమని  తెలుస్తోంది.అవకాశాలు లేక అప్పులు ఎక్కువై వాటిని తీర్చలేక, మనస్థాపం చెంది విజయ్ ఈపని చేసి ఉండవచ్చని…ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పోలీసులు ఈ ఆత్మహత్యపై  దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రంగుల ప్రపంచంలో ఎన్నో కలలు కని, తీరా అవకాశాలు రాని కారణంగా చాలామంది  ఇలా బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఆ మధ్య హీరో ఉదయ్ కిరణ్  ఆత్మహత్య కూడా చాలామందిని కలవరపెట్టింది.