COMING SOON కపిల్ శర్మా షో ! - MicTv.in - Telugu News
mictv telugu

COMING SOON కపిల్ శర్మా షో !

September 14, 2017

‘ ది కపిల్ శర్మ షో ’ ఈ అక్టోబర్ లో మళ్ళీ స్టార్ట్ అవనుంది. ఇది ఆ షో అభిమానులకు ఖుష్ కబర్. టైమింగ్ పంక్చువాలిటీతో ఆద్యాంతం ఎంతో ఎంటర్ టైన్ గా సాగే కపిల్ శర్మ షోను మళ్లీ చూసి తనివితీరా నవ్వుకునే అవకాశం ప్రేక్షకులకు కలగనుంది. ఈ షోను అత్యంతగా అభిమానించే గాయని లతా మంగేష్కర్ ఈ ప్రకటన చెయ్యటం ఆసక్తికరంగా మారింది. కపిల్ ఆరోగ్యం కుదురుగా లేక ట్రీట్ మెంట్ కోసం బెంగుళూరులో వున్నాడట. ఇప్పుడు ఆరోగ్యం కుదుటపడి ప్రోగ్రాం షూట్ కు సిద్ధపడుతున్నాడు. అయితే ఈ షోలో సునీల్ గ్రోవర్ నటిస్తాడా లేదా అన్న అనుమానాలు సర్వత్రా నెలకొన్నాయి. నవజోత్ సింగ్ సిద్దు రాజకీయాల్లో బిజీ అవడం వల్ల తను అకస్మికంగా ఈ షో నుండి వైదొలగాల్సి వచ్చింది. తన ప్లేస్ లోకి అర్చనా పురణ్ సింగ్ వచ్చి చేరింది. యథావిధిగా ఇది సోనీ ఛానల్ పైనే ప్రసారం అవనుందట.

మిగతా పాత్రల్లో అలీ అస్గర్ ( దాదీ ), కికు షర్దా ( పలక్, లచ్ఛా, పలక్ తల్లి ), చందన్ ప్రభాకర్ ( పనివాడు ), సుమోనా చక్రవర్తి ( కపిల్ భార్య ), రోచెల్లా రావు ( అతిథి పాత్ర ), అర్చనా పురణ్ సింగ్ ( జడ్జ్ ) లు యథావిధిగా కొనసాగుతారట. సునీల్ గ్రోవర్ డాక్టర్ మశూర్ మరియు కపిల్ కు మామగా, గుత్తిగా మూడు పాత్రలో కడుపుబ్బా నవ్వించిన అతను ఈ సీజన్ లో లేకపోవడం ఆ షో అభిమానులకు వెలితియే అంటున్నారు. సెట్టు కూడా మార్చి కొత్త సెట్ లో షూటింగ్ స్టార్ట్ చేస్తారట. బాలీవుడ్ లో రిలీజవుతున్న కొత్త సినిమాలకు మంచి ప్రమోషన్ అడ్డాగా మారిన ఈ షో ఎంత తొందరగా స్టార్ట్ అయితే అంత మంచిదని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.