కామన్వెల్త్ గేమ్స్ భారత్‌కు తొలి స్వర్ణం - MicTv.in - Telugu News
mictv telugu

కామన్వెల్త్ గేమ్స్ భారత్‌కు తొలి స్వర్ణం

April 5, 2018

ఆస్ట్రేలియాలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ తొలి స్వర్ణం సాధించింది. మహిళల 48 కేజీల విభాగంలో మీరాబాయ్  చాను 196 కేజీల ఎత్తి స్వర్ణాన్ని ముద్దాడింది. మారిషన్‌కు చెందిన హనిత్రా(170 కేజీలు) ఎత్తి రజితం గెలిచింది. శ్రీలంకకు చెందిన దినూష (155)  కాంస్యంతో సరిపెట్టుకుంది.2014 గ్లాస్గో కామెన్వెల్త్‌ గేమ్స్‌లో చాను  రజతంతో సరిపెట్టుకుంది. ఈసారి ఏకంగా స్వర్ణానికే గురిపెట్టింది. 21వ కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం అందించిన చానుకు పలువురు అభినందనలు తెలుపుతున్నారు. ‘నిన్ను చూసి ఎంతో గర్వపడుతున్నాం, ఫస్ట్‌ గోల్డ్‌ లేడీ’ అని పెద్ద సంఖ్యలో అభిమానులు ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు పురుషుల  56 కేజీల విభాగంలో భారత్‌కు చెందిన 25 ఏళ్ల గురురాజా రెండో స్థానంలో నిలిచి రజతం కైవసం చేసుకున్నాడు.