కమ్యూనిస్టు నేత నరెడ్డి శివరామిరెడ్డి కన్నుమూత..

గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ కమ్యూనిస్టు నేత, కమలాపురం మాజీ ఎమ్మెల్యే నర్రెడ్డి శివరామిరెడ్డి(97) కన్నుమూశారు. ఈరోజు ఉదయం హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఇటీవల అనారోగ్యం పాలైన ఆయన బ్రెయిన్ డెడ్‌కు గురయ్యారు. అప్పటినుంచి వైద్యులు, ఆయనకు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయన అంత్యక్రియలు నగరంలోని ఫిల్మ్‌నగర్ మహాప్రస్థానంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

Telugu news Communist leader Nareddy Shivarama Reddy .

శివరామిరెడ్డి స్వస్థలం కడప జిల్లా గడ్డంవారి పల్లె. 1922 ఫిబ్రవరి 25న జన్మించారు. 1957లో కమలాపురం–పులివెందుల ఉమ్మడి నియోజకవర్గం సీపీఐ ఎమ్మెల్యేగా గెలుపొందారు. సీపీఐ కడప జిల్లా కార్యదర్శిగా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఆయన పనిచేశారు. ఆయన స్వాతంత్య్ర పోరాటంలోనూ పాల్గొన్నారు. అరుణోదయ, రైతులోకం పత్రికలకు సంపాదకులుగా పనిచేశారు. 1996లో గండికోట ప్రాజెక్టు శంకుస్థాపన కోసం ఆయన నాటి కడప కలెక్టరేట్‌ ఎదుట నిరాహార దీక్షకు దిగారు. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ పార్టీల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

Telugu news Communist leader Nareddy Shivarama Reddy passed away