కండోమ్‌లపై  రాత్రిపూటే డబ్బా కొట్టుకోండి! - MicTv.in - Telugu News
mictv telugu

కండోమ్‌లపై  రాత్రిపూటే డబ్బా కొట్టుకోండి!

December 6, 2017

టీవీల్లో వచ్చే కొన్ని యాడ్స్  పిల్లల మీద దుష్ప్రభావం చూపుతాయి. . సన్నిలియోని నటించిన కండోమ్ యాడ్‌తో ప్రజల్లో కలకలం చెలరేగింది. వెంటనే ఇలాంటి కండోమ్ యాడ్స్ ప్రసారం చేసే వేళలను మార్చాలని ప్రజలు కోరడంపై  అడ్వైర్టైజింగ్ స్టాండర్స్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ( ఏఎస్‌సీఐ ) స్పందించింది. ఈ రకమైన యాడ్స్ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్యలోనే  ప్రసారం చేసుకోవచ్చని సూచించింది.‘సరదాగా ఇంటిల్లిపాది కూర్చుని  టీవీ కార్యక్రమాలు చూస్తున్నప్పుడు మధ్యలో కండోమ్ యాడ్స్ వస్తున్నాయి. ఈ యాడ్స్ చూసి పిల్లలు ఇవేం అడ్వైర్టైజులు అని వారు అడిగినప్పుడు పెద్దలకు  ఏం చెప్పాలో అర్థం కావటంలేదు. కుటుంబ సభ్యులందరూ ఇబ్బంది పడుతూ టీవీ చూడవలసి వస్తోంది ’ అని  కొందరు కేంద్ర సమాచార ప్రసార శాఖకు ఫిర్యాదులు చేశారు.

ఈ నేపథ్యంలో  కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ తరహా ప్రకటనలు రాత్రివేళ పెద్దలు మాత్రమే చూసేలా చర్యలు తీసుకోవాలని స్వీయ నియంత్రణ సంస్థ అయిన ఏఎస్‌సీఐకి ఆదేశించింది. దీంతో ఏఎస్‌సీఐ అన్నీ టీవీ ఛానెల్స్‌కు ఈ మార్గదర్శకాలు సూచిస్తామని తెలిపింది. అంతేగాకుండా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది వరకు ప్రసారమయ్యే యాడ్స్‌లో అసభ్యత, అశ్లీలత లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.