25 లక్షలకు కాంగ్రెస్ నన్ను కొనలేదు..  ఒవైసీ - MicTv.in - Telugu News
mictv telugu

25 లక్షలకు కాంగ్రెస్ నన్ను కొనలేదు..  ఒవైసీ

November 20, 2018

ఎంఐఎం పార్టీ నేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మల్‌లో అర్థరాత్రి ఎంఐఎం పార్టీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. సభలో ఆయన కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మల్ సభకు రాకుంటే కాంగ్రెస్ పార్టీ తనకు రూ.25 లక్షలు పార్టీ ఫండ్ కింద ఇస్తామని బేరమాడారని ఆరోపించారు. అందకు సంబంధించిన ఫోన్ రికార్డ్స్  కూడా తన దగ్గర వున్నాయని అన్నారు. తనను కొనేందుకు కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. తనను ఎవరూ కొనలేరని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో అందరూ టీఆర్ఎస్‌కే ఓటు వెయ్యాలని అన్నారు.Telugu news Congress did not buy me for Rs 25 lakh .. Owaisi sensation comments‘నేనేమన్నా అమ్ముడుపొయ్యే వస్తువును అనుకుంటున్నారా. నేను ఎన్నో అవమానాలను సహించి పార్టీ కోసం పని చేస్తున్నాను. నా తల మీద తాజ్(టోపీ) వుంది, గడ్డం వుంది కదా అని నేను అమ్ముడుపోయే వ్యక్తిని అనుకున్నట్టున్నారు కాంగ్రెస్ వాళ్ళు. నేను అమ్ముడుపోయేవాణ్ణి కాను. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి నన్ను బేరమాడారు. ఇప్పుడున్న ప్రభుత్వానికే పట్టం కట్టాలి’ అని అన్నారు. ఒవైసీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.