8 ఏళ్లుగా కోమాలో ఉన్న కాంగ్రెస్ నేత మృతి - MicTv.in - Telugu News
mictv telugu

8 ఏళ్లుగా కోమాలో ఉన్న కాంగ్రెస్ నేత మృతి

November 20, 2017

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి  ప్రియరంజన్ దాస్  మున్షీ(72) సోమవారం తుదిశ్వాస విడిచారు. గతంలో గుండెపోటు రావడంతో.. 8 ఏళ్లుగ ాఆయన కోమాలోనే ఉన్నారు. ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలోని వైద్యులు ఆయన చనిపోయినట్లు ధ్రువీకరించారు.

రాజీవ్ గాంధీ, మన్మోహన్‌సింగ్ ప్రధానులుగా ఉన్నప్పుడు  ప్రియరంజన్ కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఫిఫా వరల్డ్‌కప్‌లో ఓ మ్యాచ్‌కు కమిషనర్‌గా వ్యవహరించిన ప్రథమ భారతీయ వ్యక్తిగా కూడా గుర్తింపు పొందారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన మున్షీ రాయ్ గంజ్ నుంచి లోక్ సభకు ప్రాతనిధ్యం వహించారు.