కమల్‌నాథ్ తలకు గన్ గురిపెట్టిన పోలీసు - MicTv.in - Telugu News
mictv telugu

కమల్‌నాథ్ తలకు గన్ గురిపెట్టిన పోలీసు

December 16, 2017

కాంగ్రెస్ సీనియర్ నేత ,లోక్‌సభ ఎంపీ కమల్‌నాథ్ తలకు ఓ పోలీసు కానిస్టేబుల్  తుపాకీ గురి పెట్టాడు. ఢిల్లీ విమానం ఎక్కేందుకు చింద్వారా విమానాశ్రమానికి శుక్రవారం కమల్‌నాథ్ వచ్చారు.విమానాశ్రయంలో ఎంపీ భద్రత కోసం వచ్చిన కానిస్టేబుల్లో ఒక కానిస్టేబుల్ అకస్మాత్తుగా  ఎంపీ తలకు లోడ్ చేసిన గన్ గురి పెట్టాడు. వెంటనే స్పందించిన పోలీసులు సదరు కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతణ్ని  మధ్యప్రదేశ్‌కు చెందిన రత్నేష్  పవార్‌గా అధికారులు గుర్తించారు.రత్నేష్‌ను పోలీసులు విచారించగా తాను ఎందుకు అలా ప్రవర్తించానో తనకే తెలియదని చెప్పాడు. అసలు ఆ క్షణంలో తానే  చేశానో ఏం జరిగిందో తనకు ఏమీ తెలియదని అన్నాడు. ప్రస్తుతం అతనిని విధుల నుంచి తొలంగించారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేపడుతున్నట్టు పోలీసులు తెలిపారు.