mictv telugu

కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుక చౌదరి సంచలన నిర్ణయం

February 14, 2019

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఖమ్మం జిల్లాలో రాజకీయం వేడెక్కింది. పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి ఈరోజు సంచలన ప్రకటన చేశారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తనకు ఖమ్మం లోక్‌సభ టికెట్ ఇవ్వకుంటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు.

Telugu News congress party fire brand Renuka Chowdhary said if Khammam mp seat not allocated to her she will resign to party.

ముఖ్య అనుచరులు, మద్దతుదారులతో రేణుకాచౌదరి ఈరోజు తన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి తాను పోటీ చేస్తానని తెలిపారు. ఒకవేళ పార్టీ అధిష్టానం తనకు టికెట్ ఇవ్వకుంటే రాజీనామా చేస్తానని తేల్చిచెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా లోక్‌సభ విషయంలో కూడా హైకమాండ్ చివరివరకూ నాన్చుడు ధోరణిని పాటించవచ్చన్న ఊహాగానాల నేపథ్యంలో ఆమె ఈ మేరకు ప్రకటించినట్లు తెలుస్తోంది. కాగా, రేణుకా చౌదరి ప్రకటనతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక్కసారిగా అలజడి మొదలైనది.Telugu News congress party fire brand Renuka Chowdhary said if Khammam mp seat not allocated to her she will resign to party