ముత్యం రెడ్డి నాకు అన్న.. కేసీఆర్

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేటలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డిని, ఆయన కుమారుడిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ముత్యం రెడ్డితో తనకున్న పదేళ్ల అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. కేసీఆర్ మాట్లాడుతూ ముత్యం రెడ్డితో తనకు పదేళ్ల అనుభవం ఉందని తెలిపారు.

Telugu News Congress party senior leader muthyam reddy joins trs party in the presence of kcr

పార్టీలో చేరిన తరువాత ముత్యం రెడ్డి మాట్లాడుతూ… ‘నాకు, కేసీఆర్‌కు పదేళ్ల ఆత్మీయ అనుంబంధం ఉంది. కేసీఆర్ నన్ను ఎప్పుడు కలిసినా కూడా ముత్తన్నా అంటూ ఆత్మీయంగా పలకరిస్తారు. నేను తొమ్మిదేళ్లు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినా సరైన గుర్తింపు రాలేదు. టిఆర్‌ఎస్‌లో చేరడం ఆనందంగా ఉంది. కేసీఆర్‌తో కలిసి పనిచేసే అవకాశం నాకు ఇన్నాళ్లకు దక్కింది’ అని భావోద్వేగానికి గురయ్యారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయిన ముత్యం రెడ్డి దుబ్బాక సీటు ఆశించారు. కానీ మహాకూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా ఆ సీటు టీజెేఎస్‌కు వెళ్ళింది. దీనితో అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నమ్మించి మోసం చేసిందని ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం మంత్రి హరీష్‌రావు, దుబ్బాక తాజా మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిలు ముత్యంరెడ్డిని కలిశారు. టీఆర్ఎస్‌లోకి రావాలని ఆహ్వానించారు.

ముత్యం రెడ్డి, కేసీఆర్‌లు ఇద్దరూ గతంలో టీడీపీ పార్టీలో కలిసి పనిచేశారు. తరువాత పార్టీలు వేరైనా కూడా వ్యక్తిగత సంబంధాలు కొనసాగినాయి. ఇటీవల ముత్యం రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంది.

Telugu News Congress party senior leader muthyam reddy joins trs party in the presence of kcr