కాంగ్రెస్ పోస్టర్‌పై రాములమ్మ గరం - MicTv.in - Telugu News
mictv telugu

కాంగ్రెస్ పోస్టర్‌పై రాములమ్మ గరం

November 20, 2018

తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి టీపీసీసీ‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 23న తెలంగాణ ఎన్నికల ప్రచారానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ వస్తున్న నేపథ్యంలో వారికి స్వాగతం పలుకుతూ టీపీసీసీ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. అందులో టీపీసీసీ సీనియర్ నేతల ఫొటోలు మాత్రమే ఉంచారని, ఒక్క మహిళా నాయకురాలి ఫొటోను‌ కూడా ఉంచలేదని విజయశాంతి మండిపడ్డారు.Telugu News Congress Party Star Campaigner Vijayashanthi Fire On TPPC For Sonia Gandhi, Rahul Gandhi Welcome Poster‘టీఆర్‌ఎస్ పార్టీ మహిళలకు మంత్రి పదవి ఇవ్వలేదంటున్న మనం.. సోనియా గాంధీ సభ ప్రకటనల్లో మహిళా నేతల ఫొటోలు లేకపోవడం చూసి.. ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. సోనియా సభలో మగవాళ్లు మాత్రమే పాల్గొంటారా?.. మహిళలు కూడా పాల్గొంటారు కదా.. మహిళా సదస్సు మాదిరిగా ఇది పురుష సదస్సు కాదు. అందరూ ఉంటారు’ అని విజయశాంతి పేర్కొన్నారు.