కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎప్పుడూ గాంధీ, నెహ్రూ కుటుంబాల వాళ్ళే వుండకపోవచ్చు - MicTv.in - Telugu News
mictv telugu

కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎప్పుడూ గాంధీ, నెహ్రూ కుటుంబాల వాళ్ళే వుండకపోవచ్చు

March 10, 2018

‘ ఎప్పుడూ ఆ రెండు కుటుంబాల వాళ్ళే కాంగ్రెస్ పార్టీ పగ్గాలను పట్టుకొని ముందుకు నడుపుతున్నారు ’ ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఓ కుంటుంబ పార్టీ అని ముద్రపడింది. అయితే అది అపోహే అని కాంగ్రెస్ నేత సోనియాగాంధీ దాన్ని కొట్టిపారేస్తున్నారు. భవిష్యత్తులో తమ పార్టీకి నెహ్రూ – గాంధీ కుటుంబాలకు చెందినవారు కాకుండా ఇతరులు నాయకత్వం వహించవచ్చని చెబుతున్నారు.ఓ ప్రైవేట్ మీడియా ఇంటర్వ్యూలో సోనియా గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. గాంధీలు కాకుండా ఇతరులు నాయకత్వం వహిస్తే కాంగ్రెస్ పార్టీ మనుగడ వుంటుందా పోతుందా అనే ప్రశ్న తనను అడిగేకన్నా పార్టీ కార్యకర్తలను అడిగితే తెలుస్తుందన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగానే కాంగ్రెస్ నాయకత్వం కొనసాగుతోందని.. 2004లో తనకన్నా ఉత్తమ అభ్యర్థిగా మన్మోహన్ సింగ్‌ను ఎన్నుకొని ప్రధాని పదవిని కట్టబెట్టాం అని గుర్తు చేసుకున్నారు. కుటుంబ వారసత్వాలు ప్రపంచంలో అన్నీచోట్లా వున్నాయి.. అమెరికాలో క్లింటన్, బుష్ కుటుంబాలు వారసత్వ రాజకీయాలను ఏలటం లేవా.. అని అభిప్రాయపడ్డారు సోనియా గాంధీ.