రాహుల్‌ భుజంపై చెయ్యేసి.. - MicTv.in - Telugu News
mictv telugu

రాహుల్‌ భుజంపై చెయ్యేసి..

November 1, 2017


మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి అమ్మాయిల నుంచి ప్రేమలేఖలు రావడం మామూలే. అయితే ఓ అమ్మాయి ప్రేమతో కాదుగాని అలవిగాని అభిమానంతో చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.  గుజరాత్‌లో ఎన్నికల ప్రచారంలో బుధవారం పాల్గొన్న రాహుల్ భుజంపై  ఓ అమ్మాయి చెయ్యేసి మరీ సెల్ఫీ దిగింది. భరూచ్ ప్రాంతంలో జరిగిన ఎన్నికల రోడ్ షోలో ఈ ఉదంతం జరిగింది. రాహుల్ ప్రజలకు అభివాదం చేస్తుండగా, ఓ అమ్మాయి ఆయన వాహనాన్ని ఆపి  సెల్ఫీ తీసుకుంటానని రాహుల్‌ను  అడిగింది. అందుకు ఆయన ఓకే చెప్పాడు. దీంతో ఆ యువతి సంబరంతో వాహనం ఎక్కింది. రాహుల్‌కు మొదట పూలగుత్తి ఇచ్చింది. తర్వాత అతడు ఏదో చిన్ననాటి స్నేహితుడన్నట్లు భుజంపై చెయ్యేసి సెల్ఫీ తీసుకుంది. రాహుల్‌కు పుష్ప గుచ్చం ఇచ్చి, తరువాత రాహుల్  గాంధీతో సెల్ఫీ దిగ్గింది. వాహనం దిగుతూ మనదే విజయం అని చెప్పి వాహనం దిగేసింది.