ప్రకాశ్‌రాజ్‌కు కాంగ్రెస్ రాజ్యసభ టికెట్! - MicTv.in - Telugu News
mictv telugu

ప్రకాశ్‌రాజ్‌కు కాంగ్రెస్ రాజ్యసభ టికెట్!

March 12, 2018

సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌కు కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ టికెట్ ఇవ్వాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సాహితీవేత్తలు విన్నవించారు. ఈమధ్య ప్రకాశ్‌రాజ్ తరచూ ప్రధాని నరేంద్రమోదీపై ట్విటర్ వేదికగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. బహిరంగంగా కూడా మోదీపై ప్రకాశ్‌రాజ్ విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రకాశ్‌రాజ్‌ను తమ పార్టీ తరపు నుండి టికెట్ ఇస్తే మైలేజ్ బాగా వస్తుందని ముఖ్యమంత్రికి వారు చెప్పారట.సిద్దరామయ్య కూడా ఈ విషయంలో సానుకూలంగానే స్పందించారట. వెంటనే ఈ విషయాన్ని అధిష్ఠానం వద్ద ప్రస్తావించినట్టు సమాచారం. ఒకవేళ ప్రకాశ్‌రాజ్‌కు కాంగ్రెస్ టికెట్ ఖాయమైతే  మోదీని ఢీ కొనగల ధీటైన నాయకుడు అతనే అవగలడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.