ఈవారంలో బ్యాంకులకు వరుస సెలవులు - MicTv.in - Telugu News
mictv telugu

ఈవారంలో బ్యాంకులకు వరుస సెలవులు

November 20, 2018

బ్యాంకులకు మరోమారు వరుస సెలవులు వచ్చాయి. దీనితో కొన్ని రోజుల పాటు ఆర్థిక లావాదేవీలు ఆగేపోయే అవకాశం ఉంది. ఎటిఎం లలో కూడా నగదు అరకొరగా ఉండవచ్చని ఆర్థిక నిపుణులు తెలియజేస్తున్నారు. బ్యాంకులో మీకేమైనా పని ఉంటె ఈరోజే మీ పనులను పూర్తి చేసుకోండి. ఎందుకంటే వరుస పండగల నేపథ్యంలో చాలా నగరాల్లో బుధ, శుక్ర, శనివారాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి.Telugu News Continues holidays for banks in this week నవంబరు 21న ఈద్‌-ఇ-మిలాద్‌-ఉల్‌-నబీ కాగా, నవంబరు 23న గురునానక్‌ జయంతి. ఇక 24న ఆఖరి శనివారం కావడంతో పలు రాష్ట్రాల్లో చాలా బ్యాంకులు తమ కార్యకలాపాలను నిర్వహించవు. న్యూ ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌, హైదరాబాద్‌, రాంచీ, రాయ్‌పూర్‌, శ్రీనగర్‌, డెహ్రాడూన్‌, జమ్మూల్లో బుధ, శుక్ర, శనివారాలు బ్యాంకులకు సెలవు ప్రకటించారు. ఇక భోపాల్‌, బెంగళూరు, అహ్మదాబాద్‌, చెన్నై నగరాల్లోని బ్యాంకులకు కేవలం బుధ, శనివారాల్లో మాత్రమే సెలవులు ఇచ్చారు.