అత్యంత భయంకర సైకో రేపిస్ట్ అరెస్ట్.. చిన్నపిల్లలపై.. - MicTv.in - Telugu News
mictv telugu

అత్యంత భయంకర సైకో రేపిస్ట్ అరెస్ట్.. చిన్నపిల్లలపై..

November 21, 2018

ఒళ్లు జలదరించేలా అత్యాచారాలు.. చిత్రహింసలు, హత్యలు.. మాటల్లో చెప్పలేని రాక్షసత్వం.. రెండేళ్ల నుంచి సాగుతున్న ఈ ఘోరకాండకు ఎట్టకేలకు తెరపడింది. పసిపిల్లలపై అత్యంత రాక్షసంగా అత్యాచారాలకు పాల్పడి, చంపేస్తున్న సైకో కిల్లర్‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. 8 మంది చిన్నారులపై దారుణాలకు పాల్పడిన సునీల్ అనే 20 ఏళ్ల దుర్మార్గుడిని గురుగ్రామ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు వెల్లడించిన వివరాలు.. పోలీసులనే దిగ్భ్రాంతికి గురి చేశాయి. ‘నాకు పెళ్లి భోజనం అన్నా, చిన్నపిల్లను రేప్ చేయడం అన్నా ఎంతో ఇష్టం’ అని సునీల్ చెప్పాడని పోలీసులు వెల్లడించారు.

Telugu news Cops fear Gurugram rape accused is India's worst pedophile serial killer ever torture turned him on

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సునీల్ ఓ సైకో. లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి ఘోరాలకు తెగబడ్డాడు. మొదట చిన్నపిల్లలకు చాక్లెట్ల ఆశ చూపి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లేవాడు. వారి కాలును ఇటుకతో విరగొట్టేవాడు. లైంగిక వాంఛ రావడానికి ఆ ఘోరానికి తెగించేవాడు. తర్వాత అత్యాచారం చేసి, తలను ఛిద్రం చేసేవాడు. జననాంగాల్లో కర్రలు చొప్పించేవాడు.  మాటల్లో చెప్పలేని మరెన్నో చిత్రహింసలు పెట్టి చంపేవాడు. 2016లో గురుగ్రామ్‌లోని ఓ గుడివద్ద బాలికను అపహరించి తొలి ఘోరానికి తెగబడ్డాడు. ఢిల్లీ, గ్వాలియర్, ఝాన్సీ తదితర ప్రాంతాల్లో నేరాలకు పాల్పడ్డాడు. అతడు ఫోన్ వాడకపోవడంతో పోలీసులు పట్టుకోలేకపోయాడు. ఈ నెల 13న గురుగ్రామ్‌లో మూడేళ్ల బాలిక హత్యాచారానికి గురైంది. దీన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు విస్తృతంగా సోదాలు, తనిఖీలు నిర్వహించి సునీల్‌ను మంగళవారం ఝాన్సీలో అరెస్ట్ చేశారు.

rr

Telugu news Cops fear Gurugram rape accused is India’s worst pedophile serial killer ever torture turned him on