తెలంగాణలో సహకార సంఘాల ఎన్నికలకు బ్రేక్ - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో సహకార సంఘాల ఎన్నికలకు బ్రేక్

January 9, 2019

తెలంగాణ రాష్ట్రంలో జరగాల్సిన సహకార శాఖ ఎన్నికలకు బ్రేక్ పడింది. ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎటువంటి నోటిఫికేషన్లు ఇవ్వకూడదని సహకార శాఖకు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారధి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు పూర్తవగానే ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని తొలుత భావించారు. ఈ మేరకు ఈనెల 17వ తేదీన నోటిఫికేషన్‌ విడుదవుతుంది అనుకున్నారు. ఎన్నికల కోసం ప్యాక్స్‌ కోసం తుది ఓటర్ల జాబితాను కూడా రూపొందించుకున్నారు.

corporation bank elections postponed in telangana state

ఫిబ్రవరి రెండో వారంలో ప్యాక్స్‌కు ఎన్నికలు ముగియగానే అదే నెల 25వ తేదీ కల్లా డీసీసీబీ, డీసీఎంఎస్‌, టెస్కాబ్‌ ఎన్నికలు పూర్తి చేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ దిశగా సంకేతాలు కూడా ఇచ్చారు. ఇంతలో ఏమైందో గానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వ్యవసాయ శాఖ కార్యదర్శి తాజా ఉత్తర్వులు జారీ చేశారు. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఆశావహులతో బాగా పనిచేయించుకునేందుకు ఈ ఎన్నికలు ఉపయోగపడతాయన్నది టీఆర్‌ఎస్‌ ఉద్దేశంగా తెలుస్తోంది. ఎంపీ టికెట్‌ ఆశించి భంగపడ్డవారికి డీసీసీబీ చైర్మన్‌ పదవి కట్టబెట్టి సంతోషపెట్టవచ్చని, దీనివల్ల  లోక్‌సభ ఎన్నికల్లో నెగెటివ్‌ సమస్య ఉండదన్న ఆలోచన కూడా ప్రభుత్వం మదిలో ఉన్నట్లు సమాచారం.corporation bank elections postponed in telangana state