mictv telugu

దిల్లున్న కార్పొరేటర్.. వికలాంగుడిని భుజాలపై మోసుకెళ్లి..

February 13, 2019

ఓట్లు వేసిప ప్రజలను గెలిచాక నాయకులు అంతే ప్రేమగా ఆదరించాలి. ప్రజల కష్టాలను తెలుసుకుని వారి అవసరాలను తీర్చగలగాలి. అప్పుడే ఆ నాయకుడు జనం మెచ్చిన నాయకుడు అవుతాడు. ఈ కార్పోరేటర్ కూడా అలాంటివాడే. నడవలేని ఓ వికలాంగుడిని తన భుజాలపై మూడో అంతస్తు వరకు మోసుకెళ్లాడు. సర్కిల్ కార్యాలయంలో తనకు ఏం పని కావాలో అది దగ్గరుండి చేయించాడు. ఈ అరుదైన ఘటన హయత్ నగర్ సర్కిల్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. హయత్‌నగర్‌ డివిజన్‌ రంగనాయకుల గుట్టలో నివాసం ఉండే వికలాంగుడు కరణం కిరణ్‌ ఇటీవలే పాన్‌షాపు పెట్టుకుని జీవనం కొనసాగిస్తున్నాడు. అతను కరెంటు మీటరు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కానీ అది మంజూరు కాలేదు. ఈ క్రమంలో అతను‘స్ట్రీట్‌ వెండర్‌ లైసెన్సు’ కోసం దరఖాస్తు చేసుకునేందుకు హయత్‌నగర్‌లోని జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ కార్యాలయానికి వెళ్లాడు.

Telugu news Corporator who has a good minded hands .. on the shoulders of the disabled 

అక్కడతణ్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో స్థానిక కార్పొరేటర్‌ తిరుమల్‌రెడ్డిని ఆశ్రయించాడు. వెంటనే స్పందించిన కార్పొరేటర్‌ స్వయంగా కిరణ్‌ను హయత్‌నగర్‌ సర్కిల్‌ కార్యాలయానికి తీసుకెళ్లారు. కాగా, ఆ కార్యాలయంలో మూడో అంతస్తులో ఉన్న ఉప కమిషనర్‌ ఛాంబర్‌కు వెళ్లడానికి లిఫ్టు లేదు. దీంతో ఆయనే స్వయంగా కిరణ్‌ను భుజాన మోసుకుంటూ తీసుకెళ్లి వినతిపత్రం ఇప్పించారు. మూడు చక్రాల సైకిల్‌, స్ట్రీట్‌ వెండర్‌ లైసెన్సు ఇప్పించాలని అధికారులకు చెప్పారు. కార్పొరేటర్ మంచి మనసుకు స్థానికులు జేజేలు పలుకుతున్నారు.Telugu news Corporator who has a good minded hands .. on the shoulders of the disabled