దీని ధర ఉత్త 207 కోట్లే - MicTv.in - Telugu News
mictv telugu

దీని ధర ఉత్త 207 కోట్లే

November 29, 2017

అవి పైసలా పెంకాసులా అనుకుంటున్రు గదా? పైసలున్న మారాజులు ఏం జేస్తరు చెప్పున్రి. పరపతిని సూపించుకోనికి  ఎన్ని కోట్లు వెట్టైనా కొంటరు. క్రిస్టీస్ అనే సంస్థ హాంకాంగ్‌లో నిర్వహించిన వేలంలో ఓఅజ్ఞాత వ్యక్తి దీనిని 207 కోట్ల రూపాయలకు ఫోనులో వేలం పాడి మరీ కొన్నాడు.

ఈవజ్రం పేరు ‘పింక్ ప్రామిస్’ , ఈవజ్రంలో మొత్తం గులాబీ రత్నాలు పొందు పరిచారు. 14.93 క్యారెట్లున్న ఈ వజ్రం చాలా అరుదైనది అని వేలం వేసిన సంస్థ క్రిస్టీస్ తెలిపింది. మరి ఇంత ఖరీదైన  వజ్రాన్ని కాపాడడానికి  సెక్యూరిటీ కింద ఆవ్యక్తి ఇంకెంత ఖర్సు వెడ్తడో మరి.