దగ్గును నివారించండి ఇలా.. - MicTv.in - Telugu News
mictv telugu

దగ్గును నివారించండి ఇలా..

April 4, 2018

కొందరు దగ్గును  వ్యాధి అనుకుంటారు. మన శరీరంలో  కొన్ని అనారోగ్య సమస్యలు దగ్గు రూపంలో వస్తుంటాయి. అంతే కానీ అది ఎటువంటి వ్యాధి కాదు.శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలహీన పడడం వల్ల  దగ్గు వస్తుంది. దగ్గును నివారించాలంటే ఆసుపత్రికి వెళ్ళకుండా మన ఇంట్లోని ఆహార పదార్థాలతోనే తగ్గించుకోవచ్చు.రెండు ,మూడు వెల్లుల్లి రెబ్బలను బాగా నలిపి  రెండు టీస్పూన్ల తేనెతో కలిపి తీసుకోవాలి.

 

వీటిలో యాంటి బయోటిక్ గుణాలు ఉండి , రోగనిధకశక్తిని పెంచుతాయి.

 

ఒక గ్లాస్ దానిమ్మ జ్యూస్‌లో చిటికెడు అల్లం పొడి,మిరియాల పొడిని కలిపి తాగితే తగ్గుతుంది.

 

ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొంత పసుపు ,కొద్దిగా వెల్లుల్లి మిశ్రమం కలిపి తాగితే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.

దగ్గు బాగా ఉంటే చల్లని నీరు తాగరాదు. దాహం అయినప్పుడల్లా వేడి నీటిని తాగాలి. దీంతో దగ్గు త్వరగా తగ్గుతుంది.

 

ఒక కప్పు నీటిలో అర టీస్పూన్ అల్లం రసం, కొద్దిగా టీ పొడి, రెండు మూడు తులసి ఆకులను వేసి బాగా మరిగించాలి. అనంతరం వచ్చే ద్రవాన్ని వేడిగా ఉండగానే తాగాలి.