‘ఉగ్ర’ సంస్థల్లో  ముస్లింలు ఎంత మందో.. లెక్క పెట్టు !   - MicTv.in - Telugu News
mictv telugu

‘ఉగ్ర’ సంస్థల్లో  ముస్లింలు ఎంత మందో.. లెక్క పెట్టు !  

February 15, 2018

‘ దేశభక్తి ’ పై బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుబ్రమణ్యస్వామి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి కౌంటర్ ఇచ్చారు. ‘ ఉగ్రవాద సంస్థల్లో ఎంతమంది ముస్లింలు వున్నారో.. సైనికులుగా ఎంతమంది ముస్లింలు చనిపోయారో లెక్కగట్టుకో ’ అని తన ట్విట్టర్ ద్వారా విరుచుకు పడ్డారు.జమ్మూలోని సుంజ్వాన్ సైనిక స్థావరంపై జైషే మహ్మద్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఏడుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీనిపై ఒవైసీ స్పందిస్తూ ‘ సంజువాన్ ఉగ్రదాడిలో వీరమరణం పొందిన అమర జవాన్లలో ఐదుగురు కాశ్మీర్ ముస్లింలు వున్నారు. దేశం కోసం ప్రాణాలను త్యాగం చేస్తున్నా కూడా పాకిస్థానీయులు అంటున్నారు. దేశం పట్ల తమను విదేయతను చూపించుకోవాలని ఇప్పటికీ కూడా ముస్లింలను అడుగుతున్నారని ’ అసదుద్దీన్ ఒవైసీ అన్న విషయం తెలిసిందే. ఒవైసీ వాఖ్యలకు స్వామి పై విధంగా కౌంటర్ ఇచ్చారు.